ఇప్పుడన్ని ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ ఇవ్వటమే. తీరా ఇంటికి వచ్చాక అసంతృప్తిగా ఉంటుంది. చూసి నచ్చితేనే కొనటం లేదా వాపస్ పంపించే ఏర్పాట్లు ఉంటాయి కనుక ముందుగా ఆర్డర్ చేసిన దుస్తుల నాణ్యత చూడాలి. అంచుల నుంచి దారాలు ఊడుతున్నాయా కుట్టు సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆర్డర్ ఇచ్చిన డ్రెస్ చూసేందుకు రంగు బావుండచ్చు కానీ చర్మానికి మెత్తగా తగులుతుందో లేదో   మెడ పైన వస్త్రం తో రుద్ది చూసుకోవాలి. ఒకసారి ఆఫర్ చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అంత తక్కువ కు వస్తూ ఉంటే కాస్త సమయం తీసుకున్న సరే ఆ సంస్థ వివరాలు వెతికి సంతృప్తి గా ఉంటేనే ఆర్డర్ పెట్టాలి. అలాగే దుస్తులు ట్యాగ్ ను చూసి అదెక్కడ ఏ మెటీరియల్తో తయారయింది ఉతికే పద్ధతి కూడా చూడాలి. ఆన్ లైన్ లో కొన్న షాప్ లో కొన్న ఇవన్నీ చూడటం ఎప్పుడూ అవసరమే.

Leave a comment