Categories
సిట్రస్ జాతికి చెందిన కమల, నిమ్మ, నారింజ, బత్తాయి పండ్ల తొక్కల వల్ల కూడా అధిక ప్రయోజనాలు ఉంటాయి. ఒక్క సారి ఫ్రిజ్ లో ఘాటు వాసనలు వస్తాయి. ఈ సిట్రస్ పండ్లలో ఏదో ఒకదాని పొడిని తీసుకొని కొద్దిగా ఉప్పు కలిపి ఒకచిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్ లో పెడితే ఘాటు వాసనలు పీల్చుకొంటుంది చెత్త బుట్టలో ఈ ఎండిన తొక్కలు వేస్తే దుర్వాసన రాదు. ఈ తొక్కలో వుండే లేమోనేన్ అనే రసాయనానికి దోమలను ఈగలను దూరంగా ఉంచే శక్తి ఉంటుంది. నిమ్మ నారింజ,తొక్కలను నీటిలో మరిగించి అందులో ఒ స్పూన్ లవంగాల పొడి కలిపి ఆ నీటిని గది ముల్లలో స్ప్రే చేస్తే దోమలు ఈగలు రావు.