థాయిలాండ్ లో దొరికే పాలిమర్ క్లే పువ్వులకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ ఉన్నాది . అక్కడి వనితలు ప్లాస్టిక్ మట్టితో పూల మొక్కల మినీ యేచర్ ఉద్యానవనాన్ని రూపొందించు కొని ఇళ్లను అలంకరించు కొంటాడు . చిన్నతనం నుంచి పిల్లలకు ఈ పూల తయారీ అలంకరణ నేర్పుతారు . ఎంతో జాగ్రత్తగా చూస్తేగానీ ఇవి సహజమైన పువ్వులు కావు అని గుర్తించలేము . ఇప్పుడు మనదేశంలో కూడా ఎందరో కళాకారులు ఈ  పాలిమర్ క్లే  తో గులాబీ ,మందారం ,చామంతి ,దేవగన్నేరు ,ఆర్కేడ్ వంటి పూల రకాలు తయారు చేస్తున్నారు మట్టిలో కొన్ని రకాల ఖనిజాలు ముఖ్యంగా కెయోలిన్ అనే మూలకం కలుపుతారు . దీన్నే ప్లాస్టిక్ క్లే అంటారు . ఈ మట్టి అనేక రంగుల్లో దొరుకుతుంది . ఈ మధ్య ఈ మట్టికి ప్లోరోసెంట్ ,మెటాలిక్ మెరుపులను కూడా కలిపి చేయి తిరిగిన కళాకారులు అందమైన కళాకృతులు తయారు చేస్తున్నాయి .

Leave a comment