ఒకే రకమైన దుస్తులు వేసవిలో చల్లదనం ఇస్తాయి. చలికాలంలో వెచ్చగా ఉంటాయి .ఈ టెక్స్ టైల్ పేరు జానస్. చైనా కు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ వెస్ట్ లేక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా ఈ జానస్ టెక్స్ టైల్ అనే సరికొత్త రివర్సబుల్ ఫ్యాబ్రిక్ రూపొందించారు. పాలి టెట్రా ఫ్లోరో ఇథలిన్ తో చేసిన ఈ ఫ్యాబ్రిక్ ని కుట్టిన జాకెట్స్ రెండు కాలాలకి పనికి వస్తాయి. వెచ్చగా కావాలంటే జంక్ , కాపర్ నానో పార్టికల్ జోప్పించిన భాగాన్ని బయటి వైపుకు ధరిస్తే అవి సౌరశక్తిని గ్రహించి శరీర ఉష్ణోగ్రత తగ్గనివ్వవు. చల్లగా కావాలంటే పాలి మిథైల్ మేథ క్రిలైట్ పదార్థం పూతగా వేసిన వైపు ధరిస్తే అది వేడిని తిప్పి కొట్టి చల్లగా ఉంచుతుంది.