కర్ణాటక ప్రభుత్వం పౌష్టికాహార నిపుణులను సంప్రదించి ప్రత్యేక ఆహార పట్టికను తయారు చేయించింది ఉదయం ఏడు గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్,రాత్రి మళ్ళీ ఏడు గంటలకు డిన్నర్.బ్రేక్ఫాస్ట్ లోకి సోమవారం రవ్వ ఇడ్లీ,, మంగళవారం పొంగలి బుధవారం సెట్ దోస, గురువారం రైస్ ఇడ్లీ, శుక్రవారం బిసి బిల్లా బాత్, శనివారం వెజ్ బాత్ తప్పనిసరి లంచ్ లోకి ప్రతిరోజు రోటీ చపాతీ కూరగాయల వేపుడు మరి అన్నం పప్పు పెరుగు గుడ్లు.డిన్నర్ కు కూడా దాదాపుగా ఇదే మెను.ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత పది గంటలకు తర్బూజ్, బొప్పాయి, కూరగాయల సూప్ టమోటా సూప్, రాగి సూప్ వీటిలో ఏదో ఒకటి ఇవ్వాలి సాయంత్రం అరటిపండు తాజా ఖర్జూరాలు మ్యాంగో బార్ ఇవ్వాలి.డిన్నర్ తర్వాత రాత్రి 9 గంటలకు ఫ్లేవర్డ్ మిల్క్ ఇవ్వాలి ఇవన్నీ కలిపి రోజుకు 250 రూపాయలు మించకుండా ఉండాలని నిర్ణయించింది.

Leave a comment