Categories
ప్రభుత్వాల్లో మహిళల భాగాస్వామ్యం వల్ల అవినీతి తగ్గుతోందని అధ్యయనాలు చెపుతున్నాయి.ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు తీసుకుకోవటంలో మహిళలు ,పురుషుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. అలాగే మహిళా నేతలు,కుటుంబం ,మహిళల రక్షణ ,పిల్లల అంశాల పట్ల ఎక్కువ ఆసక్తిగా ఉంటారని ,ఆ ప్రభావం సాంస్కృతిక ,వ్యవస్థగతమైన అంశాలపైన కూడా ఉంటుందని అధ్యయనాల రిపోర్టులు తేల్చాయి. మహిళలు ఎక్కువగా ఉన్న చోట అవినీతి తక్కువగా ఉంటుందంటున్నారు.సంస్థల్లో మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల లంచం ఇవ్వవలసిన అవసరం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు.