ముంబై లోని సహారా హోటల్ లో ఇటీవల జరిగిన లోక్ మత్ లైఫ్ స్టయిల్ ఐకాన్ 2017 అవార్డ్  వేడుకలు ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2017 అవార్డ్ అందుకొన్నది ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్. ఈమె కాన్సర్ సర్వైవర్ ముంబై లో క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్ గా కొనసాగుతోంది. అవార్డ్ అందుకున్న సందర్భంగా మనాలి జగ్తాప్ ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ మనల్ని కుంగదీసే మాట వాస్తవం కానీ మన కల మనల్ని బతికించాలి లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి. నేను క్యాన్సర్ ను ఎదుర్కొంటున్నాను సంతోషంగా ఉండబట్టే వ్యాధిని ఓడించగలగుతున్నాను అంటుంది మానాలి.అనారోగ్యం  వస్తే భయముతో కుంగుబాటుకు లోనయ్యే వారికి మనాలి స్ఫూర్తి అవటంలో సందేహంలేదు .

Leave a comment