Categories
ప్రతి రోజు కప్పు టీ తాగితే ఆరోగ్యమే అన్ని రకాల టీ లలో ప్రధానంగా కెఫిన్,ఫ్లవనాయిడ్స్,ఫ్లేవనాయిడ్ లేవు నోట్స్ అనే జీవ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ ఎల్ డి ఎల్ ను తగ్గిస్తాయి.కొవ్వు పధార్దాలైన టీ గ్లిజరాయిడ్స్ ను కొంత మేరకు తగ్గిస్తాయి. టీ తాగడం వల్ల కొవ్వు పేరుకోవడం తగ్గుతోంది.పాలు ఎక్కువగా ఉండే వైట్ టీ కాస్త తేలిగ్గా ఉండే టీ ఆకులతో తయారవుతోంది కెఫిన్ కూడా చాలా తక్కువ. బ్లాక్ టీ లోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్తమా ఉన్నవారికి బ్లాక్ టీ నుంచి రిలీఫ్. ఊపిరి తిత్తుల్లోని గాలి గొట్టాలను వెడల్పు చేయటం ద్వారా తేలికగా శ్వాస తీసుకునేలా చేస్తుంది .