ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించేవారికి అనారోగ్యాలు దగ్గరకు రావు. చన్నీటి స్నానాలు కార్డియో వాస్క్యులార్ సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. పెంపుడు జంతువులు రిలాక్సింగ్ గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఒంటరి జీవితం ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాపారం వృత్తి స్నేహితుల సందడి సంగీతం ఇవన్నీ దీర్ఘాయిషు ఇచ్చేవే. అతిగా ఆహారం తినటం నియంత్రించుకుంటే జీవితకాలం పెరిగినట్లే క్యాలరీలు తగ్గటంలో రక్తపోటు నితంత్రణలో ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది పండ్ల కూరలు ఎక్కువగా తింటూ చిరుతిండ్లు మానేయాలి. టీ లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రో న్యూట్రియెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి పరి రక్షిస్తాయి. ఇందుకు టీ ఎక్కువగా తాగే జపనీయులే ఉదాహరణ హాయిగా నవ్వటం వల్ల యవ్వనం తో సంతోషంగా ఉంటారు. ఇక వ్యాయామం వల్ల లభించే ఉపయోగాల గురించి చెప్పనక్కర్లేదు. ప్రకృతి తో సంబంధం తగినంత వ్యాయామం పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాయి.
Categories