డెనిమ్ అంటేనే ఫ్యాషన్. ఈ పదాన్ని బాగా వంట బట్టించుకుని డిజైనర్లు డెనిమ్ తో ఏకంగా యాక్సిసరీస్ కు శ్రీకారం చుట్టారు. సన్నని డెనిమ్ దారాలను జడలా అల్లేసి పువ్వులు రాళ్లతో కలిపి చేసిన బ్రెస్ లెట్లు చాలా ముచ్చటగా వున్నాయి. ఈ క్లాత్ చెక్కు చెదరకుండా కొత్తగా కనిపించటంతో షూ చెప్పులూ టోపీలు రకరకాల నెక్లెస్ లు కఫ్ బ్రెస్ లెట్లు మొదలైనవి ఆధునికమైన పోకడతో చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం నీలి రంగులోనే ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ లయితే ముదురు రంగుల్లో వున్నబట్టతో ప్యాచ్ వర్క్ డిజైన్లతో కుందన్ తో స్వర్వోస్కీ రాళ్ళూ పూసలు అతికించి రకరకాల మెటల్ డిజైన్లు కలిపి ఏ డ్రెస్ కన్నా సూటయ్యే రకంగా తయారు చేస్తున్నారు. మామూలు గాజుకు డెనిమ్ క్లాత్ ను చుట్టేసి చూడగానే ఇది ఇవాళ్టి ఫ్యాషన్ అనిపించేలా తయారు చేస్తున్నారు. డెనిమ్ క్లాత్ ఫంకీ జ్యూవెలరీ ఇమేజెస్ లు పూర్తిగా ఈ క్లాత్ తో చేసిన నెక్లెస్ లుచుస్తే ఫ్యాషన్ అంటే డెనిమ్ అనిపించేలా ఉన్నాయి. రెండు రోజుల క్రితం ఫంకీ జ్యూవెలరీ ని ఓసారి చూడండి.
Categories