ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక రుగ్మత అనుకోరు. ఉదయం నుంచి రెస్ట్ లేకపోవటం అనేసుకుంటారు. కానీ ఈ నీరసం డిప్రెషన్ వల్ల రావచ్చు. శరీర వ్యవస్థను కుంగదీసే దాన్ని గుర్తించరు. కీళ్ల నొప్పులు తలా నొప్పి నిద్ర తిండి ఎక్కువగా తినటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. సాధారణంగా నిద్ర సరిగా పోకపోయినా అదే డిప్రెషన్ కు దారి తీస్తుంది. ఉదయపు పనుల భారం అప్రమత్తంగా ఉండటం నిద్రమేళకువ రాదేమోనన్న భయం ఇవన్నీ కలిసి మాటమాటికి నిద్రా భంగం కలిగిస్తాయి. అలంటి రోజులు గడుపుతుంటే సరైన నిద్రపోక సరైన ఆహరం తీసుకోక ఆరోగ్యం పాడవుతుందని గ్రహించలేక నిజంగానే అనారోగ్యం కొనితెచ్చుకుంటారు, ఇలాంటి లక్షణాలు ఉంటే డిప్రెషన్ ప్రభావం వుండమేమో కానీ డాక్టర్ ని కన్సల్ట్ చేయమంటున్నారు పరిశోధకులు.
Categories