Categories
డెస్టినేషన్ వెడ్డింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్. సెలబ్రిటీలు,ధనవంతులు తమకు నచ్చిన ప్రకృతి రమణియమైన ప్రదేశాల్లో కోటలు రాజా ప్రసాదాలు ఎంపిక చేసుకుని ఇష్టమైన కొందరు బంధు మీత్రులతో కలిసి పెళ్ళి చేసుకోవడం థ్రిల్ గా భావిస్తున్నారు. ఎన్నో రిసార్ట్ లు హోటళ్ళు ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఈ పెళ్లిళ్ళ ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే పేరు పొందిన దేశాల్లో పర్యాటక శాఖలు కూడా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ పై దృష్టి పెట్టాయి. మన దేశంలో ఎక్కువగా ఇటలీ,థాయ్ లాండ్ దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.గత సంవత్సరం టూరిజం మార్కెట్ అధ్యాయనాలు భారతీయ వివాహ మార్కెట్ విలువ లక్ష పదివేల కోట్ల రూపాయలు అంచనావేస్తే అందులో నాలుగో వంతు డెస్టినేషన్ వెడ్డింగ్ లేనట.