ప్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఒత్తుగా ఉన్న కనుబోమ్మలు అందం అంటున్నారు. దళసరి కనుబోమ్మలు కావాలంటే ముందుగా వాటిని స్వేచ్చగా పెరగనివ్వాలి. కాస్త షేప్ ఔట్ అవ్వగానే పార్లర్ కి వద్దు. రెండు మూడు నెలలకి కాని కనుబోమ్మలు వత్తుగా అవ్వవు. రోజు మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ప్రతిరోజు అలీవ్ నూనెతో కాని,కొబ్బరి నూనెతో కాని కనుబోమ్మలు మర్ధన చేయాలి. ఇంకా ఒత్తుగా పెరగడం లేదు అనుకుంటే గుడ్డులోని తెల్లసోన కనుబోమ్మలకి రాసి ఇరవై నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే అంతే కనుబోమ్మలు ఆరోగ్యంగా ఉంటాయి.

Leave a comment