Categories
ఇప్పుడు డైమాండ్ నగలు చాలా ఫ్యాషన్.అందరికి అందుబాటులో ఉండే ఖరీదులో చిన్న పెండెంట్ ఉన్నా డైమాండ్ నగలు కూడా వస్త్తున్నాయి.నగ మొత్తం చిన్న రాళ్ళు ఉండి పెండెంట్ మధ్యలో లేదా నక్లెస్ మధ్యలో పచ్చ,కెంపు పొదిగిన యాంటిక్ టాక్ లో కనిపించే నగలు వస్తున్నాయి. అలాగే ఒక నగలో వజ్రాలు పొదిగిన మేర వైట్ పాలీష్ తో మిగిలిన నగ అంతా గోల్డెన్ పాలీష్ తో నగలు వచ్చాయి. వేడుకల్లో మెరిసే నగలు ఆకర్షణీయంగా ఉంటాయి.వైట్ కుందన్ ,చోకర్ ,వైట్ బ్యాంగిల్స్,లాంగ్ ఇయర్ రింగ్స్ అమ్మాయిలు ఇష్టపడే నగలు. ఈవన్ని డైమాండ్స్ తో తయారై మరింత అందంగా అపురూపంగా కనిపిస్తు ఉన్నాయి.అసలు ఈ నగలు నగిషీలు చాలా ప్రత్యేకం.