Categories
వస్తువుల ఉపరితలం పైన కరోనా వైరస్ 72 గంటల పాటు జీవిస్తుంది .సూపర్ మార్కెట్ లో వస్తువులు కొనితెచ్చుకొన్న తర్వాత వాటిని బయటికి తీసి వంటగదిలో శుభ్రమైన ప్రదేశం లో ఉంచాలి .పండ్లు కూరగాయలు 30 సెకన్ల పాటు చల్లని నీళ్ళతో కడగాలి .బంగాళాదుంపలు క్యారెట్ వంటివి నీళ్ళలో కాస్సేపు బాగా రుద్ది కడగాలి .ఫ్రిజ్ లో నిల్వ ఉండే పదార్దాలు తెస్తే క్యాన్ లు , బాక్సల వంటివి బాగా తుడిచి కడగటం వల్ల వైరస్ ప్రభావం తగ్గుతుంది .సరుకుల కోసం ఇంట్లోంచి సంచి తీసుకువెళితే ఆ సంచి ని ఇంటి బయటే ఉంచి శుభ్రం చేయాలి .సరుకుల ఫ్యాకింగ్ మెటీరియల్ పైన కొన్ని రోజుల పాటు కరోనా వైరస్ జీవించి ఉంటుంది కనుక శ్రద్ధ గా అన్ని కడిగి , సబ్బు నీటితో తుడిచి శుభ్రం చేయాలి .