పురాణాలు ఇతిహాసాల ప్రకారం వంటల్లో చేయి తిరిగిన వాళ్ళు మగవాళ్లే .నలుడు, భీముడు పేరు వినబడుతోంది కానీ ఆడవాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. అలా తీరిక దొరికితే చాలు ఈ నలభీముల్ని మరిపిస్తారు మన స్టార్స్. ఉప్మా నుంచి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, దోశలు ఏవైనా అద్భుతంగా వండగలను అంటారు చిరంజీవి .నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మ వంట చేస్తుంటే దగ్గరే ఉండి చూసేవాడిని ఆమెకు వంటలో సాయం చేస్తూ అన్నీ నేర్చుకున్నా .పెద్దయ్యాక సినిమాల్లో బిజీ అయ్యాక వంట గదిలోకి వెళ్లే సమయం దొరకడం లేదు. కానీ అవకాశం వస్తే మటుకు అదరగొడతాను అంటారాయన .పిల్లల కోసం వంట నేర్చుకున్నాను అంటారు అజయ్ దేవగణ్ మొగలాయి చైనీస్ చికెన్ కర్రీ లు బిరియాని ఏవైనా వండేస్తాను కానీ మా పిల్లలు, కాజోల్ తిండి విషయంలో కఠిన నియమాలు ఫాలో అవుతాము అస్తమానం కుదరదు. కానీ ఫ్యామిలీ చీట్ మీల్ డే అని ఓ రోజు అనేసుకుని అన్నీ వండి పెడుతుంటాను అంటారు అజయ్ దేవగణ్. ఇకపోతే వత్తిడిగా అనిపిస్తే మా ఆవిడకు మంచి వంట చేసి పెడుతూ అది తినేసి ఆమె ఆహా అంటే చాలు నా ఒత్తిడి కాస్త చేత్తో తీసేసినట్టు పోతుంది. మా అమ్మ దగ్గర నేర్చుకున్న లాక్ డౌన్ విరామంలో ఎన్నో కిటుకులు నేర్చుకొని ఎప్పటి నుంచో చేయాలనుకున్న వంటలన్నీ చేసేశా. చాలా సరదా నాకు వంటంటే అంటారు ఎన్టీఆర్ జూనియర్ వంట చేయటంలో దొరికే ఆనందం అంతా ఇంతా కాదు అంటారీ సెలబ్రిటీలు !
Categories