Categories
చెట్ల వరస తిమ్మక్క గా ప్రసిద్ధురాలైన 104 సంవత్సరాల తిమ్మక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది తుముకూరు లోని తన మెట్టినింటి సమీపంలో హులికల్ కూడూర్ రహదారికి ఇరువైపులా 48 మీటర్ల దూరం 400 మర్రి చెట్లను నాటి వాటిని సాకారు తిమ్మక్క.భర్తతో కలిసి ఆమె చేసిన కృషి వల్ల రహదారికి ఇరువైపులా బ్రహ్మాండమైన వృక్షాలు ఉన్నాయి. ఇందుకే ఆమెను 2019లో పద్మశ్రీ తో భారత ప్రభుత్వం గౌరవించింది. పర్యావరణ ప్రేమికుల్లో స్ఫూర్తి నింపిన తిమ్మక్క కు ఇప్పుడు డాక్టరేట్ లభించింది.