వర్క్ ఫ్రమ్ హోం వల్ల ప్రయోజనాలుతో పాటు ఇబ్బందులు ఉంటాయి. సరైన భంగిమలో కూర్చోలేక పోవటం కంప్యూటర్ టేబుల్ కుర్చీ ఎత్తుల్లో తేడాలు ఎముకలు,కండరాలకు సమస్య తెచ్చిపెడతాయి పని కోసం ఏ ప్రదేశాన్ని ఎంచుకున్న మధ్యలో బ్రేక్ తీసుకొని లేచి నిలబడుతూ కొద్దిదూరం నడుస్తూ ఉండాలి. ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుండటం వల్ల కళ్లు అలసటకు లోనవుతాయి. ఈ ఇబ్బంది లేకుండా కంప్యూటర్ వెలుగు కళ్ళ లోకి నేరుగా ప్రవేశించకుండా స్క్రీన్ ను కళ్ళకు సమాంతరంగా కాకుండా 15 నుంచి 20 డిగ్రీల మేరకు కిందికి వంచి పని చేసుకోవాలి కళ్ళకు అలసట చెందకుండా యాంటీ గ్లౌవ్ కళ్ళజోడు పెట్టుకోవాలి కళ్ళను తరచుగా ఆర్పుతూ  ఉండాలి.

Leave a comment