Categories
ఈ లాక్ డౌన్ లో నిముషం తీరిక లేకుండా ఉన్నారు మహిళలు ఈ సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ చూపించకపోతే అనారోగ్యాన్ని కొని తెచుకొన్నట్లే. ఉదయం అల్పాహారం నిర్లక్ష్యం చేస్తే నీరసం రాక తప్పదు. మధ్యాహ్నం భోజనంలో అధిక కేలరీలు ఉండకూడదు . తిన్న వెంటనే నిద్రపోరాదు ఉదయం సమయం తక్కువగా ఉండే గుడ్లు,పాలు,లేదా పెరుగు తీసుకొన్న సరిపోతుంది. మధ్యాన్నం అన్నం కూర పప్పుతో పాటు కీరా టమోటా వంటి పచ్చి ముక్కలు తీసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు మజ్జిగ మొలకెత్తిన గింజలు పండ్లు తీసుకుంటే పోషకాలు దొరుకుతాయి. సమయానికి అవసరమైనంత పోషకాహారం తీసుకొంటు కాసేపయినా ఎండలో గడిపితే చాలా మంచిది.