Categories
మునగాకు లో విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువ. ఇది మల్టీ విటమిన్ టాబ్లెట్ మాదిరిగా పని చేస్తుంది. ఇంటి పనిలో అలసటగా ఉంటే ఓ కప్పు మునగాకు టీ తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. అరకప్పు మునగాకు తీసుకొని నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్, నాలుగు స్పూన్ల తేనె వేసి రెండు నిమిషాలు ఉంచి వడకట్టుకోవాలి. ఈ టీ తో అలసట, బలహీనత పోతాయి.