ఇ-విటమిన్ నూనె ఎన్నో సౌందర్య సమస్యలకు పరిష్కారం అంటున్నారు ఎక్సపర్ట్స్. ఉదయం రాసుకొనే మాయిశ్చరైజర్ క్రీమ్ కు కొన్ని చుక్కల ఇ-విటమిన్ నూనె కలిపి రాసుకుంటే ఎంతో ఉపయోగం. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావలసిన తేమ అందుతుంది. ఎండకు చర్మం కమిలిన చర్మం నిర్జీవంగా అనిపించిన ఈ నూనె వాటిని దూరం చేసి మెరుపునిస్తుంది. అలాగే శిరోజాల సమస్యలకు కూడా నూనెలో రెండు క్యాప్సూల్ ఇ-విటమిన్ కలిపి తలకు రాసి, ఓ అరగంట ఆగి తలస్నానం చేసినా చాలు. అలాగే నిర్జీవంగా తయారైన గోళ్ళకు కూడా కొంచెం ఇ-విటమిన్ నూనె పట్టించి మృదువుగా మర్దన చేస్తే జీవం సంతరించుకుంటాయి.

Leave a comment