Categories
చవకగా వస్తాయని చాలామంది షియామీ,ఒప్పో, వివో వంటి చైనా ఫోన్ లను కొంటు ఉంటారు. ఈ ఫోన్ లలో వినియోగదారులతో నిమిత్తం లేకుండా వారి వ్యక్తిగత సమాచారం చైనా కి తరలిస్తున్నారని సిర్లిన్ అనే సైబర్ సెక్యూరిటీ ఎక్సపర్ట్స్ ఆధారాలతో సహా నిరూపించారు. 2014 లో భారత వైమానిక దళం ఈ చైనా ఫోన్లని వాడద్దని తన సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది. ఈ చైనా అప్లికేషన్ లలో ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసుకొని భారతీయ మహిళల ఫోటోలను వారి అనుమతి లేకుండా డౌన్ లోడ్ చేసుకొని వాటితో వ్యాపార ప్రకటనలు రూపొందిస్తున్నారని ఎక్సపర్ట్స్ చెపుతున్నారు. ఈ ఫోటోల్లో కనబడే మహిళలలతో చాటింగ్ చేయాలంటే తమ అప్లికేషన్ లు డౌన్ లోడ్ చేసుకోమని యువతను ప్రేరేపిస్తూ ఉంటాయి అంచేత ఈ ఫోన్ లతో జాగ్రత్త అంటున్నారు ఎక్స్ పర్ట్స్.