‘శారీ విత్ శాక్సోఫోను’గా పిలుస్తారు ఎం.ఎస్ సుబ్బలక్ష్మీని. మగవాళ్లే కష్టంగా భావించే శాక్సోఫోన్ ని నిశ్చయించుకొని ఎంతో కష్టపడింది సుబ్బలక్ష్మి. విఖ్యాత శాక్సోఫోను కళాకారులు కదిరి గోపాలనాథ్ శిష్యులరాలు ఆమె. ఈ సంగీత పరికరంతో ఆధునిక శైలి పలకరించగలదు సుబ్బలక్ష్మి. ఆమె దేశవ్యాప్తంగానే కాదు… అమెరికా, సింగపూర్, దుబాయ్, ఇంగ్లాండ్, జపాన్ తదితర దేశాల్లోనూ ప్రదర్శన ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం అందించే కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోనూ స్థానం దక్కించుకుంది. సాధరణంగా శాక్సోఫోను కళాకారులంటే ఆధునిక వస్త్రధారణతో కనిపిస్తుంటారు. ఎందుకంటే దాన్ని పట్టుకోవడం కూడా కాస్త కష్టమే. అందుకే పట్టుచీర, బంగారు ఆభరణాలతో అచ్చమైన భారతీయ మహిళగా కనిపించడం మొదలుపెట్టారు. అలా ఆమె ప్రదర్శనలు చూసి అంతా ఆమెను శారీ విత్ శాక్సోఫోనుగా పిలవటం ప్రారంభించారు. విదేశాల్లో అయితే తన ఆహార్యంతో పాటు నాదైన శైలిలో వైవిధ్య సంగీతాన్ని అందించటం కొత్తగా ఉందంటూ ప్రత్యేకంగా అభినందించేవారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంగ్లండ్‌లోని కార్పొరేట్ సంస్థల వరకు నేను ఇచ్చిన వేలాది ప్రదర్శనలు నాకెంతో గుర్తింపు తెచ్చాయి.