Categories
ఇప్పుడు ఖరీదైన స్వీట్ షాపుల్లో ఆర్టీఫిషియల్ స్వీటెనర్లతో చేసిన స్వీట్లు దర్శనిమిస్తుంటాయి.చెక్కెరతో చేసిన పదార్ధాలు శరీరానికి హాని చేస్తాయి అని నమ్మేవాళ్ళు.మధుమేహం ఉన్నవాళ్ళు ఇవి ఆలోచించకుండా తినేస్తుంటారు. డైట్ డ్రింక్ లోని తీపి ప్రత్యమ్నాయాలు ,రెస్టారెంట్లో ఉండే సాచెట్స్ కూడా బరువును ,డయాబెటిక్ అవకాశాలను బాగా పెంచుతాయి.ఈ విషయం ఇటివల జరిగిన అద్యాయనాలు నిరూపించాయి. ఆర్టిఫిషియల్ స్వీట్ నర్లకు అత్యధిక కొవ్వు స్థాయిలకు, గ్లూకోజ్ ఇన్ టాలరెన్స్ కు నడుమ గల సంబంధంపై ఇస్రాయిల్ శాస్త్రవేత్తలు అద్యాయనం చేశారు.ఈ స్వీటైనర్లు రక్తంలో అదనపు చెక్కర ను పెంచుతాయని తేల్చారు.