మౌనంగా ఉండమని మౌనంగా ఏం జరిగినా మౌనంగా భరించమని ఊరికే అల్లరైపోవద్దని  అమ్మాయిలకు నూరిపోయడం అంటే వాళ్ళను చేజేతులా నరక కూపంలోకి నెట్టివేయటమే అని మరాఠి నటి మృణాల్ ఠాకుర్ ఒక తాజా ఇంటర్యూలో చెప్పింది. ఆమె నటించిన లవ్ సోనియా చిత్రం ఈనెల 14వ తేదిన దేశవ్యాప్తంగా విడుదల అవుతుంది. మోసపోయి పడుపు వృత్తిలో కూరుకుపోయిన ఒక పల్లెటూరి అమ్మాయి జీవితం ఎన్ని ఆటుపోట్లకు గురైందో వాటన్నింటిని ఆమె ఎంత ధైర్యంగా ఎదుర్కుందో ఈ చిత్ర కథ.లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా 21 జూన్ 2018న ప్రదర్శించారు.ఇందులో ఫ్రిడా ప్రింటో,డెమీమూర్ ,మనోజ్ బాజ్ పాయ్,రాజ్ కుమార్ రావ్ మొదలైన వాళ్ళు నటించారు.

Leave a comment