Categories
రక్త నాళాల్లో దెబ్బతిన్న లోపలి పొరను బాగు చేయటంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుందని ఒహయో విశ్వవిద్యాయలం నిపుణులు చెపుతున్నారు.ఇప్పటి వరకు ఈ పొర కేవలం రక్తప్రసరణ వ్యవస్థకు కవచంలా మాత్రమే పని చేస్తుందని భావించే వాళ్లు ,కానీ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పరిశోధనల్లో ఆ పొర ఒక కీలకమైన అవయవమని ,అది దెబ్బ తింటేనే బిపి ఇన్సులిన్ నిరొధం,మధుమేహం ,గుండె జబ్బు ,పక్షవాతం వంటివి వస్తాయని తెలింది. ఇలాంటి రక్త నాళాల లోపలి పొర ,ఎండోథేలియమ్ సంరక్షణకు విటమిన్ డి ఎంతో దోహాదం చేస్తుందని తేలింది.రక్త ప్రసరణ సరిగా జరిగేందుకు తోడ్పడే నైట్రిక్ ఆక్సైడ్ విడుదలలోనూ ఇది కీలకపాత్ర వహిస్తుందనీ పరిశోధనలు తేల్చాయి.