Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2022/11/annie-ernaux.jpeg)
ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ బహుమతి ఫ్రాన్స్ కు చెందిన రచయిత్రి ఆనీ ఎర్నౌ కి దక్కింది.1901 లో ప్రారంభించిన ఈ సాహిత్య నోబుల్ బహుమతి ఇప్పటివరకు 118 మంది అందుకున్నారు అందులో మహిళలు 16 మంది ఆనీ ఎర్నౌ 17వ మహిళా సాహిత్య విజేత 1963 లో గర్భస్రావం చేయించుకున్న ఆనీ ఎర్నౌ తను అనుభవించిన హింస, అవమానాలు హ్యాపెనింగ్ నవల లో రాశారు. 1940లో పుట్టిన ఆనీ తన 23వ ఏట అవాంఛిత గర్భం ధరించింది. ఆనాటికి గర్భస్రావం అన్నది సామాజిక అవమానం చట్ట విరుద్ధం గర్భం దాల్చిన ఆడపిల్ల సామాజిక నీతిలో విఫలం అయిందన్న ముద్ర భరించవలసి ఉండేది. 1975 వరకు ఫ్రాన్స్ లో అవివాహతులకు గర్భస్యాప్యేచ్చ లేదు ఆనాటి తన అనుభవం హ్యాపెనింగ్ నవలకు ఈ అవార్డు పొందింది రచయిత్రి ఆనీ ఎర్నౌ.