కొన్ని అద్యాయినాలు వినేందుకు బావుంటాయి. సహజంగా మనం అస్తమానం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాళ్ళని సెల్ ఫోన్ లో గంటలు గడిపేవాళ్ళను విమర్శిస్తాం. ఆ పద్దతి మంచిది కాదని చెప్పుతూ వుంటాం. అయితే బర్కింగ్ హామ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక 600 మంది పైన అద్యాయినం చేసి, వాళ్ళ ఆహారపు అలవాట్లు సోషల్ మీడియా లో వాళ్ళ చురుర్కుదనం, సెల్ ఫోన్లు, యాప్ లు ఎంత సేపు చూస్తారు అన్న విషయం పై అద్యాయినం చేసి హెల్త్ యాప్ లు ఫాలో అయ్యే వారి, మానసిక సమస్యలు తగ్గు ముఖం పట్టాయని, వాళ్ళలో భావోద్వేగాలు అదుపులో వున్నాయని కనుగోన్నారట. అలాగే వాళ్ళ ఆహార నియమాలు చక్కగా మారాయని, మంచి హెల్త్ ఫుడ్ తెసుకుంటూ సంతోషంగ, అరిగ్యంగా ఉన్నారని కనిపెట్టారట. బాగానే వుంది. మరి హెల్త్ యాప్ ల వరకు సరే మిగితా యాప్ లన్నీ చుట్టూ చుట్టేస్తూ నిరంతరం సెల్ ఫోన్ లోనే బతికేస్తున్న వారి సంగతి ఎలా?
Categories