నిన్ను నాలోకి చూసుకొని తెలుసుకో అంటారు ఎక్స్ పర్ట్స్. కాజల్ చేస్తోంది ఇదే నీ బలహీనతలను నీవు గుర్తించటం కూడా బలమే అన్న సూత్రాన్ని నమ్ముతుందట. ఏదైనా ఒక సని మొదలు పెడితే పిచ్చిపట్టినట్లు ఆ పని పైన పడిపోతా . ప్రతి దానికీ అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. నాకు తెలిసినా సరే ఆ పని పూర్తి చేసే దాకా కుదురుగా ఉండలేను . ఎన్నీ గంటలైనా ఆపని మీదే ద్యాస. కాసేపు నా కోసం మిగిల్చుకోకుండా పని చేస్తా. ఇవన్నీ బలహీనతలే కదా. కానీ కొత్త విషయాలు నేర్చుకొంటూ సాగిపోవటం నాకు నెగిటివ్ విషయాలన్నీ పాజిటీవ్ గా మలుచుకొంటూ సాగిపోవటం నాకు ఇష్టం. లోపాన్నీ సవరించుకొంటున్నా, కొత్త వి పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి అంటుంది కాజల్. ఈ చక్కని హీరోయిన్ కి తనకు తాను తెలుసుకునే చక్కని మనసున్నట్లే.

Leave a comment