Categories
సౌదీ ఇక నుంచి మహిళల డైవింగ్ చేయవచ్చని సౌదీ రాచ్ కుటుంబం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జూన్ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. దాదాపు మూడు దశాబ్ధాల నుంచి ఈ హక్కు కోసం మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపధ్యంలో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోరాటానికి స్ఫూర్తి ప్రోఫెసర్ ఫేజియా ఆల్ ఒకర్. 2013 లో అమ్మాయిల డ్రైవింగ్ లైనర్స్ కోసం నిర్వహించిన ఆన్ లైన్ పిటిషన్ వెనక కుడా వున్నది ఫౌజియానే. దాదాపు 15 వేల మంది అమ్మాయిలు సంతకాలు చేసిన ఈ పిటిషనే, నేడు ప్రభుత్వ విప్లవాత్మక ప్రకటన వెనక కీలకం. సౌదీలో మహిళల హక్కులు అవకాశాలు ప్రోత్సహించేందుకు ఇదొక సానుకూల మైన చర్య అని, ఇది నిజంగా విప్లవాత్మకమైన నిర్ణయం అని ప్రముఖులు కొనియాడారు.