బ్లాక్ గ్రే కొంచెం దగ్గర దగ్గరే వుంటాయి కానీ బ్లాక్ కలర్ డ్రెస్ లు ఏ  సందర్భానికైనా బాగానే ఉంటాయి. కానీ ఆఫీస్ వర్క్ కు ఫార్మల్ గా కట్టుకునే చీర డ్రెస్ సూట్ ఏదైనా గ్రే కలర్ సూటవుతుందంటారు. దాన్లో లెక్కలేనన్ని షేడ్స్. చార్కోల్ గన్ మెటల్ కలర్స్ నేవీ బ్ల్యూ  దృఢత్వం ఆత్మ విశ్వాసం తెలిపే లాటిన్  బ్లూ క్లాసిక్ స్మార్ట్ నెస్ ను ప్రతిబింబిస్తాయి. వస్త్ర శ్రేణి ఎలాంటిదయినా  సిల్క్ కాటన్ పట్టు ఏ కలర్ చీర అయినా డ్రెస్ అయినా హుందాగా ధరించే పూర్తి సీరియస్నెస్ ను చూపిస్తూ వుంటాయి. సెమీ ఫార్మల్ గా వెల్ డ్రెస్సింగ్ కోరుకుంటే లైట్ గ్రే సారీస్ సరైన ఎంపిక. సాధారణంగా వైట్ తప్ప మిగతా అన్ని రంగులు ఆఫీస్ వేర్ గా బావుంటాయి. సంప్రదాయంగా కనిపించే నేవీ బ్లూ లేని అందం గ్రే లో వుంటుంది. అయితే ఈ లేత రంగు ఐడెంటికల్ గా కొటొచ్చినట్లు కనబడే రంగు కాదు కానీ మంచి ఖరీదైనది మంచి లుక్ ఇచ్చేదిగా  వుండాలి. ఎక్కువ ఫార్మల్ గానే కనిపించాలి. అనుకుంటే గ్రే కలర్ శారీ  ఎంచుకోమంటున్నారు స్టయిలిస్ట్ లు. ఇందులో ప్యూరీ సిల్క్ లు సింపుల్ సెల్ఫ్ స్టెప్స్ కుడా క్లాసిక్ లుక్ ఇస్తాయి . గ్రే అందమైన హుందా నిచ్చే  హాడావుడి కనిపించని సింపుల్ కలర్.

Leave a comment