ఒక చక్కని ఆలోచనకు కూటి రూపాయల ఫండింగ్ అందింది. యాస్మిక్ ముస్తఫా అనే అమ్మాయి ఫిడెల్ఫియా లో పుట్టింది. దక్షిణ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లైంగిక హింసే రుచి చూసింది. ఈ సమస్యకు పరిష్కారంగా సొంతూరు వెళ్లి స్నేహితురాలితో కలిసి యధేనా  అనే యాంటీ రేప్ డివైస్ ని తయారు చేసింది. చిన్న బటన్ మారిదిగా ఉండే ఈ పరికరం గొలుసుతో వేసుకోవటానికి డ్రెస్ కు అమర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు ఈ బటన్ నొక్కితే అత్యవసర జాబితాలో ఉన్నవాళ్ళకి ఆపదలో ఉన్న విషయం తెలుస్తుంది. ముందుగా అలారం కూడా మోగుతుంది. ఈ మంచి డివైస్ కోసం ఇప్పటికే ఆమెకు కోటి రూపాయల ఫండింగ్ అందింది.

Leave a comment