వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ తో కొనసాగించవచ్చు. పెరిగే కొద్దీ విజ్ఞానం పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని చవిచూసిన అనుభూతులతో వాస్తవాన్ని ఆస్వాదించాలి. భర్తతో పిల్లల్తో ఎక్కువ సమయం  గడపచ్చు. లేదా జీవితం మొత్తం హడావుడి పరుగులతో సొంతానికి కొద్ది సమయం కూడా చేసుకున్న రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆలా పక్కకుపెట్టిన ఎన్నో పనులు ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకున్న పరీక్షలకు కట్టినా కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఏదైనా చేసేందుకు సమయం వుందనే  పాజిటివ్ దృక్పధంతో ఉండాలి.

Leave a comment