Categories
స్కిన్ టానింగ్ గురించి చాలా పాకేజీలు, వైద్యులు చూస్తూ వుంటాం. ముఖం పైన ముడతలు పోగొట్టి చర్మం బిగుతుగా అయితే యవ్వనంతో కనిపించడం ఎవరికి అయినా బావుంటుంది. ఖరీదైన వైద్యుల సంగతి అలా వుంచి ఈ చిట్కా చాలా ఉపయోగ పడుతుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. క్యాబేజీని మెత్తగా పేస్టు లా చేసి ఇందులో బియ్యం పిండి కలిపి ముఖానికి పాక్ వేసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే ముఖంపై ముడతలు పోతాయి. వారానికొ సారి ఇలా చేస్తే చాలు. మెడనలుపుగా వుంటే ఒక టవల్ కు వేడి నీటిలో మేడపై నల్లగా వున్న చూట రుద్దుతూ వుంటే క్రమంగా మెడకు స్టీమ్ అంది నలుపు తగ్గడం ప్రారంభిస్తుంది మెడ పై కొవ్వు తగ్గించే ఈ చిట్కాను వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వుంటుంది.