సృష్టిలో ఎన్నో విచిత్రాలు. చింతకాయలంటే పుల్లని పులుపే. కానీ ఇందులో వెల్వెట్ చింత కూడా ఈ జాతి రకమే. వెల్వెట్ టామరిండ్ గా పిలిచి ఇవి చేసేందుకు ద్రాక్ష పండ్లులా ఉంటాయి. ధాయ్ లాండ్, జీవ సుమత్రా ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయి. మాములు చింతకాయల కంటే ఎంతో రుచి. బాగా పండాక, పెంకు ఊడిపోతుంది. లోపల గుజ్జు నారింజ రంగులో వుంటుంది. ఈ చింత ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధుల నివారణలో వాడుతారు. ఇక మన వైపు పండే చింతకాయతో నిల్వ పచ్చళ్ళు, ఎండిన పండ్లు, సంవత్సరం పొడుగునా వాడుకునే చింతపండుగా ఉపయోగిస్తారు. చింతపండులోని టార్టారిక్ ఆమ్లం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలోని హానికర ప్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. కాలేయం పనితీరును జీర్ణక్రియను పెంచుతుంది. చింత చెట్టులో ప్రతి భాగము ఉపయోగమే.
Categories