Categories
వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో వచ్చినట్లే మెదడులో కూడా మార్పులు వస్తాయి. శరీరం చురుగ్గా స్పందించదు. అలాగే మెదడు చురుకు దనం తగ్గుతుంది. కొంచెం పెద్ద వాళ్ళు మనం గబగబా ఏదైనా చెపితే గబుక్కున స్పందించరు.కాసేపు ఆలోచించుకొంటారు.ఇలా కాకుండా మెదడు చురుగ్గా ఉండాలంటే ల్యూటెన్ ఉండే ఆకుకూరలు ,గుడ్లు తీసుకోవాలి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అధ్యయన శక్తి కూడా అధికంగానే ఉంటుందంటున్నారు పరిశోధకులు. చిన్నప్పటి నుంచే ఆహారంలో ఎగ్ వైట్, తప్పని సరిగా ఆకుకూరలు తింటూ ఉంటే మెదడు చురుకు తనం పోకుండా ఉంటుంది.