Categories
ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉంచితే ఇల్లు విశాలంగా శుభ్రంగా ఉంటుంది. వంటింట్లో అవసరం లేని జాడీలు కనిపించే వీలులేకుండా అటక ఎక్కించటం మంచి పద్ధతి ఇళ్ళంతా వస్తువులతో పేరిస్తే వంటింట్లో ఇరుగ్గా అయిపోతుంది. ఇల్లు శుభ్రం చేసే చీపుర్లు మాప్ లు పెరడు, లేదా స్టోర్ రూమ్ లో ఉంచేయాలి. లాండ్రి బాస్కెట్ స్థానం బెడ్ రూమ్ కి మార్చాలి. డైనింగ్ టేబుల్ పైన సాల్ట్, పెప్పర్, పికిల్స్ కోసం చిన్న జాడీలు ఉంచుకోవాలి అంతేగాని వంటింటివి డైనింగ్ టేబుల్ పైకి చేర్చకూడదు.మురికి పట్టిన సిల్వర్ నాబ్స్ స్విచ్ లను వారానికొకసారి సబ్బు నీళ్లతో తుడిచి శుభ్రం చేయాలి. వంటింట్లో హాల్లో బాల్కనీల్లో మూత ఉన్న డస్ట్ బిన్స్ ఉంచాలి.