Categories
కాలా సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హూమా ఖురేషి. సినిమా రంగంలో వినిపిస్తున్న లైంగిక వేధింపులు గురించి అడిగితే పని ప్రదేశంలో అసమానతలే లైంగిక వేధింపులకు కారణం అవుతాయని నా ఉద్దేశ్యం అంటుంది హూమా. స్ర్తీ పురుషులను ఒకేలా చూస్తే ఈ వేధింపులు ఉండకపోను. ఎక్కడైన ఉన్నాయి కానీ ఈ రంగంలో కాస్తా ఎక్కువ వినిపిస్తున్నాయి అంటుంది హూమా ఖురేషి. స్త్రీలలో కూడా మార్పు రావాలి అంటుంది ఆమె మాములు ఉద్యోగాల్లో ఉన్నట్లు ఇన్ని గంటలు పని చేస్తానంటే ఈ రంగంలో కుదరదు. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో కావాలి. ఇక్కడ కనిపించే జయాపజయాలకు కారణాం మనం ఒక్కళ్ళే కాదు ఎన్నో ఉంటాయి. అందుకే వీటికి కుంగి పోకుడదు పట్టించుకోకుండా ముందుకు పోవాలి అంటుంది హూమా ఖురేషి.