కొన్ని పరిశోధనల ఫలితాలు వింటూ ఉంటే భయం వేస్తోంది. మన శరీరం కూడా మనకి అపకారం చెస్తుందని చెపుతుంటే ఎలాఉంటుంది.ఆడవాళ్లకు పుట్టు మచ్చలు ఎక్కువ ఉంటే రొమ్ము కాన్సర్ వచ్చే సూచనలు అని తెలుసుకోండి అంటున్నారు పరిశోధకులు . పుట్టు మచ్చలు ఎక్కువ ఉన్నవాళ్ళలో రక్తం లో ఎస్ట్రోడియల్ ,టెస్ట్రోస్థిరన్ శాతం అధికంగా ఉందని ,వీటి వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని చెబుతున్నారు.పుట్టుమచ్చలు ఉంటే వదిలేయండి గానీ, ఏ మచ్చ అయినా పెరిగినట్లు అనిపించినా, వాటి చుట్టూ ఏవైనా మచ్చలు వచ్చిన,తప్పకుండా డాక్టరను కన్సల్ట్ చేయమంటున్నారు.

Leave a comment