ఇవ్వాల్టి యువతరానికి ఎకో ఫ్రెండ్లీ గా వుండటం ఫ్యాషన్. చెత్త నుంచి, పేపర్ నుంచి మొక్కల నుంచి తయ్యారు చేసిన పదార్ధం తో చేవిలోలాకులు, మేడలో వేసుకునే హారాలు వేసుకోవడం ఫ్యాషన్. మట్టి నగలు ఎప్పటి నుంచో ధరిస్తున్నారు. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఒక బ్రాండ్ ఇమేజ్. పక్షుల ఈ కలతో చేసిన హెయిర్ క్లిప్పులు, పెద్ద పెద్ద జుంకీలు ఇప్పుడు స్టేటస్ సింబల్స్ . ఈ కలలతో తయ్యారు చేసిన చెప్పులు, పర్సులు, హెయిర్ క్లిప్పులు, ఎన్నో ఆకర్షనీయమైన వస్తువులన్నీ ఇప్పుడు అమ్మాయిలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి వుడ్ బ్రాస్ లెట్స్, రీ సైకిల్ బ్రాస్ లెట్లు, ఆర్గానిక్ లోటస్  సీడ్స్ హారాలు ఫ్యాబ్రిక్ బ్రాస్ లెట్స్ తో పాటు ఈ కళ నగలు ధరించిన అమ్మాయిలను ఇవ్వాళ ఆశ్చర్యంగా చూడనక్కరలేదు. అందరు అవే ధరిస్తున్నారు కదా.

Leave a comment