పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా పెద్దగా పశాకల విలువలు మారని కూరల్లో మొట్ట మొదటిగా చెప్పుకోవలసింది పాలకూర. ఇందులో చాలా పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్, లుటిన్, విటమిన్-కె, ఫోలెట్ ఇంకా ఎన్నో లవణాలు పుష్కలంగా దొరుకుతాయి. పీచు ఎక్కువే ఉడికిస్తే కెరోటినాయిడ్స్ కొంత తగ్గుతుంది. మిగతా పోషకాలు, విటమిన్లు తేడాలేవు. అయితే ఒకే ఒక్క నిమిషం పలకూరని ఉడకనిచ్చి అందులో నీళ్ళను పరబోయాలి. అలా చేస్తే నీటి లోని అక్సాలిక్ యాసిడ్ బయటకి పోతుంది. శరీరానికి కాల్షియం అందకుండా చేసేది ఇది. దాన్ని బయటకి పంపించాక ఇక ఆకు కురలోని కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి పడుతుంది. అప్పుడిక ఎలా ఇష్టం అయితే అలా తినొచ్చు. ఇన్ఫెక్షన్లు రానీయదు, మలబద్దకం నియంత్రిస్తుంది, రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. జీవక్రియలు సాఫీగా జరిగేందుకు ఉపయోగ పడే ఈ పలకూర ఆహారంలో తప్పని సరిగా చేర్చాలి.
Categories