ప్యాడ్ మ్యాన్ లో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఇందులోని పాత్రకు అక్షయ్ తప్ప ఇంకేవరు న్యాయం చేయలేరు అంటుంది రాధిక ఆప్టే . సినిమా సెన్షేషన్ హిట్ కావడంతో ఆమె ఎంతో సంతోషంగా ఉంది. అన్నీ భాషాల్లో కలిపి పది చిత్రాలకు పైగా ఆమె చేతిలో ఉన్నాయి. హీరోయిన్ అనేది ఓ ఖరీదైన జాబ్ . కథానాయికలు బోలెడంత సంపాదిస్తారని అనుకుంటారు కానీ అదే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. అందం కాపాడుకొనే విషయం దగ్గరి నుంచి వేసుకునే దుస్తులు , చక్కని శరీరాకృతి కోసం ట్రైనర్ లను పెట్టుకోవడం కూడా ఖర్చే . కానీ ఏది తప్పదు అంటోంది రాధికా ఆఫ్టే . నిజమే ఎంత చెట్టుకు అంత గాలి.

Leave a comment