చర్మం తాజాగా, ముడతలు,మచ్చలు లేకుండా నిగనిగలాడాలంటే కొబ్బరిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. దీనిలోని కాల్షియం,ఫాస్పరస్ శరీరానికి సమపాళ్లలో అందటం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి.శరీరంలో ఇనుము లోపిస్తే ఎర్రకణాల కు తగిన ఆక్సిజన్ అందదూ రక్తంలో హిమోగ్లోబిన్ వృద్ధి అవ్వదు. రోజు కప్పు కొబ్బరి పాలు ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన దానిలో సగం ఐరన్ అందుతోంది కొబ్బరి నుంచి లభించే జింక్ జుట్టు రాలనివ్వదు.దీన్ని నేరుగా తిన్న వంటకాల్లో ఉపయోగించినా ఎన్నో పోషకాలు సొంతం అవుతాయి.

Leave a comment