షాదీ డాట్ కామ్ ఇండియా లో  పేరున్న పెళ్లి సంబంధాలు చూసే వేదిక. ఈ సైట్ లో ఒక స్కిన్ కలర్ ఫిల్టరే ఉంటుంది. ఫెయిర్,వీటిష్,డార్క్ ఈ మూడు రంగుల్లో వంటి ఛాయను చెప్పేస్తారు. ఈ మ్యాట్రిమోనియల్ సైట్ లో ఫాలో వివరాలు ఇచ్చేవారు,రంగులు చెప్పేందుకు తప్పని సరిగా ఈ ఫిల్టర్ ఉపయోగించి చెప్పాలి.ఈ రంగు చెప్పే పద్ధతిని మేఘన్ నాగ్ పాల్ అమ్మాయి అసలు అంగీకరించ లేకపోయింది.సైట్ లో ఆ కలర్ ఫిల్టర్ ని తొలగించమని కోరింది కానీ చాలామంది పేరెంట్స్ రంగు గురించి అడుగుతారు మేము తొలగించ లేము అన్నారు షాదీ డాట్ కామ్ వాళ్లు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ చార్ట్ కు పెట్టింది మేఘన్ నిజమే ఏమిటీ వర్ణ వివక్ష అంటూ అంతా ఆమె కు సపోర్ట్ చేశారు యూఎస్ లో ఉంటున్న హేతల్ లఖాని దీన్ని సంతకాల ఉద్యమం చేసింది.చేంజ్ డాట్ ఓ ఆర్ జి లో ఆమె పిటిషన్ పెడితే 14 గంటల్లో 15 వందల మంది సంతకాలు పెట్టారు.ఈ అభిప్రాయాలు గౌరవిస్తూ సైట్ లో స్కిన్ కలర్ ఫిల్టర్ తొలగించబోతోంది షాదీ డాట్ కామ్.

Leave a comment