డైనింగ్ టేబుల్ పైన తినటం సౌకర్యంగానే ఉంటుంది. కానీ మన పాత కాలంలో లాగా కింద కూర్చోని తినటం మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాళ్ళు ముడుచుకొని నేలపై కూర్చోని తినాలి. దీన్నే యోగా సుఖాసనం అంటోంది. ఈ భంగిమ మల్ల వెన్నుపూస నిలువుగా ఉంటుంది.దానికి సంబంధించిన కండరాలు బలపడతాయి. తొంటి భాగానికి కూడా మంచిదే .కాళ్ళు రెండు మడిచి కూర్చుంటే రక్తం పొట్టకి బాగా సరఫరా అవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ వేగం శోషణ వేగం పెరుగుతాయి.కూర్చొని ఆహారం తీసుకొంటే కనీసం మూడు సార్లు ఈ సఖాసనం వేయవచ్చు. శరీరపు కదలికలు అప్పుడు అదుపులో ఉంటాయి.

Leave a comment