Categories
ఏ కాస్త స్వేచ్ఛ ఇవ్వకుండా,అలగా పిల్లల విషయంలో పరమ స్ట్రిక్ట్ గా వ్యవహరించటాన్ని కంట్రోలింగ్ టైగర్ పేరింటింగ్ అంటున్నారు ఎక్సపర్ట్స్. వాళ్ళ సమస్త విషయాలను పెద్దవాళ్ళే నిర్ణయిస్తూ వాళ్ళ అంచనాల ప్రకారం పిల్లలు పెరగాలనుకునే ఈ పేరింటింగ్ విధానం అత్యంత దారుణం అంటున్నాయి అధ్యయనాలు. ఈ పెంపకంలో పిల్లలు తల్లితండ్రులకు మానసికంగా చాలా దూరం అవుతారు. భయంతో పెద్దలు చెప్పింది విని చేస్తారు కానీ బాంధవ్యాలు పూర్తిగా పోతాయి పనిష్ మెంట్ల భయంతో తప్పులు చేస్తారు. ఆత్మన్యోనతతో వుంటుంది. ఎస్ అని చెపుతూ ప్రతికూలంగా అనవసరంగా ఆలోచిస్తారు . కోపంతో పాకులాడుతారు అబద్దాలు ఆడతారు. పిల్లల విషయంలో అంత కర్కశమైన పెంపకం వద్దంటారు ఎక్సపర్ట్స్.