Categories
2021 సంవత్సరం మహిళలకు బ్రహ్మాండమైన స్ఫూర్తిని శక్తి నిరూపించుకునే అవకాశాలు ఎన్నో ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వధువు వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా ఒక మంచి మార్పు ఇచ్చే ఉద్దేశ్యం ఉంది. చిన్న వయసులోనే జరుగుతున్న పెళ్లిళ్లు అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని దీనివల్ల ప్రసవానంతర మరణాలు నవజాత శిశు మరణాలు పెరుగుతున్నాయని సర్వేలు చెప్పటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. 21 ఏళ్ల కు వివాహం చేసుకుంటే ఆడపిల్ల చదువు పూర్తవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతుంది ఈ మార్పు స్త్రీల జీవితాలను ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం భావించింది.