బయటకు వెళ్లేప్పుడు ఫోను, క్రెడిట్ కార్డ్ వంటి ముఖ్యమైన 12 వస్తువుల కోసం వేసుకున్న డ్రెస్ కు పాకెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బ్యాగ్ తగిలించుకొని వెళ్లే అవసరం లేకుండా చక్కని డిజైనర్ పాకెట్స్ తో డ్రెస్ తయారవుతున్నాయి. ప్లేన్ కుర్తా టాప్ ఏదైనా సరే ఎంబ్రాయిడరీ సొగసులు, ప్యాచ్ వర్క్ మెరుగు లతో, కాంట్రాస్ట్ కలర్స్ తో ఈ ప్యాకెట్ ను కుట్టేస్తున్నారు. ప్యాచ్ వర్క్ అయినా పాకెట్ చుట్టూ ఎంబ్రాయిడరీ చేసి అయినా అసలు ఆ డ్రస్ కు ఈ పాకెట్టే అందం అనే అంత బాగున్నాయి. లాంగ్ గౌన్ ల, ప్లెయిన్ లాంగ్ కుర్తాలకు ఈ ఎంబ్రాయిడరీ జేబులు చాలా కొత్తగా అందంగా అమరిపోయాయి. ఇటు అవసరం తీరింది. అందంగానే ఉంది అని అమ్మాయిలు చూడగానే కొనేస్తున్నారు.

Leave a comment