New Blue pottery పేరుతో  దిశారీ మాథుర్ సిరామిక్ వ్యర్థాలతో సాంప్రదాయ అచ్చులు ఉపయోగించి అందమైన సిరామిక్ వస్తువులు తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశరీ మాథుర్ సిరామిక్ ఆర్ట్  తో ఒక విన్నూత  ప్రక్రియను కొనసాగిస్తోంది. దిశారీ సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో ఇంటీరియర్ డిజైనర్ గా డిగ్రీ పొందింది లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజ్ నుంచి ఇన్నోవేషన్ డిజైన్ లో మాస్టర్ డిగ్రీ చేసింది. సిరామిక్స్ వ్యర్థాల నుంచి ఇంటికి అలంకరణ వస్తువులే కాదు కొత్తగా సిరామిక్ ఫర్నీచర్ కాన్సెప్ట్ కూడా తీసుకువచ్చారు దిశారీ. ఈమె సృష్టించే కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది.

Leave a comment