ఎండ వేడికి ఒక్కొసారి చర్మం కమిలినట్లు ముదురు రంగులోకి వస్తుంది. అలా రంగు మారిన చర్మాన్ని చల్లబరిచి ,పుర్వపు రంగులోకి తెచ్చేందుకు ఈ చిట్కా చాలా చక్కగా పనికి వస్తుంది. పసుపు చర్మానికి మెరుపునిస్తుంది.శనగపిండి తెలుపునిస్తుంది.ఒక చెంచా పసుపు ఒక కప్పు శనగపిండి లో పాలతో కాని నీళ్ళతో కాని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపైన శరీరం పైన పట్టించుకోని ఆరి పోనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే చాలు చర్మం చక్కగా ఉంటుంది.ప్రతిరోజు ఇలాంటి పూత వేసుకోని స్నానం చేస్తే ఎండ వేడికి చర్మం కమిలే ప్రసక్తే ఉండదు.

Leave a comment